ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కనమరుగవుతోన్న మానవత్వం... యువత పైశాచికత్వం.. - జస్టిస్ ఫర్ దిశ

హత్య.. ఆత్మహత్య... రోడ్డు ప్రమాదం.. ఇలా ఏది జరిగినా  సామాన్యులు  అయ్యో అనుకుంటుటే.. కొందరు యువత మాత్రం సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. కనీసం సానుభూతి లేకుండా సామాజిక మాధ్యమాల్లో అనుచిత కామెంట్లు పెడుతూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా దిశ ప్రవర్తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.

అంతరిస్తోన్న మానవత్వం... యువత పైశాచికత్వం..
అంతరిస్తోన్న మానవత్వం... యువత పైశాచికత్వం..

By

Published : Dec 5, 2019, 3:12 PM IST


తెలంగాణలో దిశ అత్యంత కఠినమైన పరిస్థితుల్లో నలుగురు కామాంధుల చేతికి చిక్కి బలైపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సచలనం సృష్టించింది. అయితే దీనిపై సామాజిక మాధ్యమాల్లో దిశకు అందరూ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ జస్టిస్ ఫర్ దిశ​ అని పోస్టులు పెడుతుంటే... కొందరు పోకిరీలు మాత్రం ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాట్సప్, ఫేస్​బుక్​లలో అసహ్యంగా కామెంట్లు పెట్టడమే కాక.. అమె ప్రవర్తనపై కూడా అనుచిత కామెంట్లు చేస్తున్నారు. దీనిపై నెటిజెన్లు దుమ్మెత్తి పోశారు.

ఆ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన హైదరాబాద్​ సీసీఎస్ పోలీసులు.. అసభ్య కామెంట్లు చేసిన ఫేస్​బుక్ 'స్మైలీ నానీ గ్యాంగ్' గ్రూప్​లో ఉన్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. తెలంగాణలో నిజామాబాద్​కు చెందిన శ్రీరామ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన ఫేస్​బుక్ గ్రూప్ అడ్మిన్ నానిని కూడా అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. మరో వైపు రాయదుర్గంలోని ఓ మహిళా వైద్యురాలు ఇచ్చిన ఫిర్యాదుతో అనిల్ కుమార్ అంబాల అనే వ్యక్తిని సైబరాబాద్ సీసీఎస్ పోలీసులు కటాకటాల్లోకి నెట్టారు.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల క్రితం బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో అర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ద్విచక్ర వాహనంపై వెళుతున్న టీసీఎస్ ఉద్యోగిని సోహిని సక్సేనా అక్కడికక్కడే మృతి చెందింది. ఓ వైపు భార్య చనిపోయిందని భర్త తీవ్రంగా రోదిస్తుంటే.. మరో వైపు ఓ పోకిరీ మృతదేహం ముందు ఏ మాత్రం మానవత్వం లేకుండా సెల్ఫీ తీసుకుంటూ మూర్ఖుడిలా ప్రవర్తించాడు. చదువుకున్న యువకులు, ఉద్యోగం చేస్తున్నవారే ఇలా మానవాతారాహిత్యంగా ప్రవర్తించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువత ఆలోచనలలో మార్పు రావాల్సిన అవసరం ఉందని.. వారు పెడదారి పట్టకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఎంతైనా ఉందని సామాజిక నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details