ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ట్యాంక్​బండ్​లో బైక్​ విసిరేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు - throwing bike at Tank Bund news

పెరిగిన ఇంధన ధరలపై యూత్ కాంగ్రెస్ (Youth Congress) నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్​కు ద్విచక్రవాహనంపై వచ్చినవారు.. తాము ప్రయాణించిన బైక్​ను నీటిలో విసిరేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణ : ట్యాంక్​బండ్​లో బైక్​ విసిరేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ : ట్యాంక్​బండ్​లో బైక్​ విసిరేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

By

Published : Jun 11, 2021, 8:43 PM IST

పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ (Youth Congress) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, ప్రధాన కార్యదర్శి శైలేందర్ ద్విచక్ర వాహనంపై వచ్చి ట్యాంక్ బండ్​లో తాము ప్రయాణించిన బైక్​ను విసిరేసి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు.

తెలంగాణ : ట్యాంక్​బండ్​లో బైక్​ విసిరేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

కేంద్రం భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని యూత్ కాంగ్రెస్ (Youth Congress) నాయకులు ఆరోపించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ నిరసనలతోనైనా మోదీ మేలుకోవాలని హితవు పలికారు.

ఇదీ చూడండి:LOKESH LETTER: సీఎంకు నారా లోకేశ్ లేఖ.. పది, ఇంటర్ పరీక్షల రద్దుకు డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details