IPL Betting: ఐపీఎల్లో 'వాట్సాప్' బెట్టింగ్.. చివరికి ఏమవుతోంది?
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం అవ్వడం.. ఇటు క్రికెట్ ప్రియుల్లో ఎంత ఆనందాన్ని నింపుతుందో.. అటు బెట్టింగ్(IPL BETTING IN TELANGANA) రాయుళ్లకు అంతే ఆశ కలిగిస్తోంది. మ్యాచ్‌లు ప్రారంభమైన నాటి నుంచి బెట్టింగ్‌లు జోరందుకుంటున్నాయి. మొబైల్ ఫోన్ ద్వారా బెట్టింగ్‌ల(IPL BETTING IN TELANGANA)కు పాల్పడుతూ ఎంతో మంది యువత అప్పుల పాలవుతున్నారు. చివరకు డబ్బు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఐపీఎల్లో 'వాట్సాప్' బెట్టింగ్
By
Published : Sep 28, 2021, 10:31 AM IST
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కావడంతో మరోసారి బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)లు జోరందుకుంటున్నాయి. ఒకప్పుడు గదులు అద్దెకు తీసుకుని బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)లు నిర్వహించేవారు. నేడు చరవాణి ద్వారా పందేలు కాసే పరిస్థితి వచ్చింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, వనపర్తి, కోస్గి, నారాయణపేట, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, గద్వాల, అయిజ తదితర పట్టణాల్లో బెట్టింగ్ ఏజెంట్లు తమ వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. జడ్చర్లలో ఓ వ్యక్తి పందేలతో అప్పుల పాలై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
హోటళ్ల వద్ద గాలం..
ఉమ్మడి జిల్లాలో బెట్టింగ్(IPL BETTING IN TELANGANA) ఏజెంట్లు పట్టణాల్లోని మార్కెట్లు, హోటళ్లు, టీ కొట్టుల వద్ద యువతకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. వీరిని నియంత్రించే వ్యక్తిని డాన్ అంటారని, వారు ఎవరు? ఎక్కడ ఉంటారు? వారి నేపథ్యం ఏజెంట్లకు కూడా తెలియదని సమాచారం. కర్నూలు, రాయచూరు, హైదరాబాద్ ప్రాంత డాన్‌ల ద్వారా ఉమ్మడి జిల్లా ఏజెంట్లు వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలిసింది. మట్కా దందా నిర్వహించేవారే క్రికెట్ పందేల్లోనూ కీలక భూమిక పోషిస్తున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌కు గంట ముందు నుంచే వాట్సప్ గ్రూప్‌ల ద్వారా బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)లు ప్రారంభమవుతుంటాయి. అందుకోసం యువత కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేసుకుని, ఆ నంబరు ద్వారా ఏజెంట్లను సంప్రదిస్తూ బెట్టింగ్ కాస్తుంటారు. టాస్ వేసినప్పటి నుంచి చివరి ఓవర్ వరకు ఈ ప్రక్రియ సాగుతుందని సమాచారం.
అంతా యువకులే..
మూడేళ్ల కిందట మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని బాదేపల్లిలో ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)జరుగుతుండగా పోలీసులు దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడు ఇక్కడ గదిని అద్దెకు తీసుకుని వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు. పందేలు కాసేవారందరూ యువకులే కావడం గమనార్హం.
గతేడాది వనపర్తిలో 16 మంది యువకులు ఓ ఇంటి మిద్దెపై చరవాణిలో క్రికెట్ పందేలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
రెండేళ్ల కిందట జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో ముగ్గురు వ్యక్తులు బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)నిర్వహిస్తుండగా స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏజెంట్లు కూడా ఉన్నారు. గద్వాల పట్టణంలో కూడా ఓ లాడ్జిలో క్రికెటు పందేలు నిర్వహిస్తూ ఏజెంట్లు పోలీసులకు పట్టుబడ్డారు.
కన్నవారికి కన్నీరు మిగిల్చారు..
నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)మూలంగా అప్పులపాలై ఏడాది కిందట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు కేసు నమోదు కాకున్నా పందేల వల్లనే అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరిగింది.
ఏడాది కిందట జడ్చర్లకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ క్రికెట్ బెట్టింగ్‌లో మొత్తం కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆరేళ్ల కిందట దేవరకద్రకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో స్థిరపడి అక్కడే క్రికెటు బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)ల కారణంగా అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అప్పుల పాలై ఊరు విడిచారు..
నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన ఓ యువకుడు బస్టాండు సమీపంలో టీకొట్టు నడిపేవాడు. స్థానిక ఏజెంటు పరిచయంతో రూ.వేలల్లో పందేలు కాశాడు. రూ.14 లక్షల వరకు అప్పు అయింది. దీంతో ఏడాది కిందట ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు అతని ఆచూకీ లేదు.
వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ వనపర్తిలో నివాసముండేవాడు. పందేల కోసం రూ.1.80 లక్షలు అప్పు తీసుకుని చెల్లించాడు. వడ్డీ కలిపి అప్పులు రూ.5 లక్షలకు చేరుకున్నాయి. దీంతో గతేడాది వనపర్తి వదిలి బతుకుదెరువుకు హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు.
కుటుంబ సభ్యులు గమనించాల్సింది ఇవీ..
30 సంవత్సరాలలోపు వయసు వారి విషయంలో కుటుంబసభ్యులు జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి ఎవరైనా కొత్తవారొస్తే వివరాలు తెలుసుకోవాలి.
మ్యాచ్‌ల సమయంలో వారు బయటకు వెళ్తున్నారా.. ఏ సమయంలో వస్తున్నారు? రోజూ అలాగే జరిగితే ఆరా తీయాలి.
ఇంట్లో డబ్బులు అడుగుతున్నారా? దేని కోసం అడుగుతున్నారు? వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు? అనే విషయమై నిఘా ఉండాలి.
క్రికెట్ పోటీలు ఉన్న సమయంలో చదువు మీద ఆసక్తి పెట్టలేకపోవడం కనిపిస్తే కూర్చోబెట్టుకుని మాట్లాడాలి.
ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న దృష్ట్యా చరవాణిలో తరచూ ఆ విషయమై మాట్లాడుతూ ఉంటే అనుమానించాలి.
క్రీడా పోటీల సమయాల్లో కొత్త సిమ్ తీసుకుంటే కారణం తెలుసుకోవాలి.
మఫ్టీలో నిఘా పెట్టాం
క్రికెటు బెట్టింగ్(IPL BETTING IN TELANGANA)లకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదు. అనుమానిత ప్రాంతాల్లో సిబ్బందిని మఫ్టీలో నిఘా పెట్టాం. గతంలో జరిగిన సంఘటనలను దృష్ట్యా పూర్తి స్థాయిలో బెట్టింగులను అరికడతాం. కుటుంబాలను నాశనం చేసే బెట్టింగులపై పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారు. - రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగులాంబ గద్వాల