కరోనా నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా అదుపులోకి రాకపోగా.. నిత్యం కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతోంది. బాధితుల్లో యువత ఎక్కువగా ఉండడం.. ఆందోళనను పెంచుతోంది. ఈ విషయాన్ని ప్రభుత్వమే వెల్లడించింది. కరోనా సోకిన వారిలో 60 శాతానికి పైగా 16 నుంచి 45 వయసు మధ్యే వాళ్లే ఉన్నారని స్పష్టం చేసింది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరింది.
కరోనా బాధితుల్లో యువతే ఎక్కువ!
రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. వరుసగా నాలుగో రోజు 80కి పైగా కేసులు నమోదు అయ్యాయి. లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేస్తున్నా కేసులు సంఖ్య పెరుగుతోంది. యువత కూడా కరోనా బారిన పడుతున్నారని ప్రభుత్వం తెలిపింది. బాధితుల్లో 60 శాతం యువతే ఉన్నారంది.
కరోనా బాధితుల్లో యువతే ఎక్కువ!