ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీ ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు : రాజధాని రైతులు - amaravati taza vartalu

అమరావతిలోనే రాజధాని ఉండాలని... దాని కోసం ఎందాకైనా తెగిస్తామని రైతులు ఘంటాపథంగా చెబుతున్నారు. 144 సెక్షన్‌ పేరుతో ఆందోళనలకు పోలీసులు అనుమతి ఇవ్వకున్నా... 25వ రోజునా నిరసనలు కొనసాగించేందుకే నిర్ణయించారు. నేడు జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులు పర్యటించే అవకాశమున్నందున వారికి అన్ని ఆధారాలు అందచేసేందుకు మహిళలు సిద్ధమయ్యారు.

మీ ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు
మీ ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు

By

Published : Jan 11, 2020, 6:31 AM IST

రాజధాని రైతుల పోరు నేటితో 25వ రోజుకు చేరింది. మొత్తం 29 గ్రామాల్లోనూ 144 సెక్షన్‌ విధించిన పోలీసులు... పెద్దమొత్తంలో సిబ్బందిని మొహరించారు. ఎవరూ బయటకు రాకూడదంటూ నిబంధనలను కఠినతరం చేశారు. అయితే పోలీసుల ఆంక్షలకు వెరవకుండా మహిళలు, రైతులు తమ ఇళ్ల వద్ద నిరసనలు కొనసాగిస్తున్నారు.

ఆలయాలకు వెళ్లే వారిని సైతం పోలీసులు అడ్డుకుంటుండటంపై రైతులు మండిపడుతున్నారు. మహిళలపై పోలీసుల చేసిన దాడులకు సంబంధించిన వీడియోలను సేకరించిన గ్రామస్థులు... నేడు జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులకు వాటిని ఆధారాలుగా చూపించేందుకు సిద్ధమయ్యారు. ఎన్ని ప్రాణాలు పోయినా ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు.

నేడు మందడం, తుళ్లూరుల్లోమహాధర్నాలు నిర్వహించనుండగా... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలుకొనసాగనున్నాయి. ఉద్ధండరాయునిపాలెంలో శంకుస్థాపన జరిగిన చోట వివిధ గ్రామాల రైతులు పూజలతో తమ నిరసన తెలపనున్నారు.

మీ ఆంక్షలు మమ్మల్ని ఆపలేవు

ఇదీచదవండి

సమరావతి :రాజధాని రైతుపై గర్జించిన లాఠీ

ABOUT THE AUTHOR

...view details