'మీ ప్రతి నిర్ణయం.. ప్రజలకు శాపం' - Your every decision is becoming a curse to people: Lokesh
ఈకేవైసీ కష్టాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే లబ్ధిదారుల తొలగింపు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పిల్లలు, మహిళలు 20 రోజులుగా ఎన్ని అవస్థలు పడుతున్నారో కనిపిస్తుందా అని ప్రశ్నించారు. మీ ప్రతి నిర్ణయం ప్రజలకు శాపంగా మారుతోందంటూ ట్వీట్ చేశారు.

మీ ప్రతి నిర్ణయం వాళ్లకు శాపంగా మారుతోంది: లోకేష్
ఈకేవైసీ పేరుతో లబ్ధిదారులను తొలగించే కుట్ర జరగుతుందంటూ ప్రభుత్వంపై నారా లోకేష్ మండిపడ్డారు. పాదయాత్రలో అర్హులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి...అధికారంలోకి రాగానే ఆంక్షల పేరుతో కోతలా అని ప్రశ్నించారు. పథకాల నుంచి తొలగించేందుకే రేషన్ కార్డులకు ఈకేవైసీ చేయించుకోవాలంటున్నారని ఆరోపించారు. కనీసం ఇప్పటినుంచైనా చిత్తశుద్ధితో ప్రజల గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. వెంటనే నమోదు కేంద్రాలను పెంచి ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని తెలిపారు.