ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: తల్వార్లతో ఆకతాయిల హల్​చల్​.. రోడ్డుపై బీభత్సం

ఆకతాయిలు గంజాయి సేవించి... రోడ్డుపై వెళ్తున్నవారి పట్ల అసభ్యంగా ప్రవరిస్తున్న ఘటన... తెలంగాణ రాష్ట్రం రాజేంద్రనగర్​ నియోజక వర్గంలోని అత్తాపూర్​ మారుతీనగర్​లో చోటుచేసుకుంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

By

Published : Dec 2, 2020, 10:59 PM IST

youngsters-halchal-on-road
తల్వార్లతో ఆకతాయిల హల్​చల్​

తల్వార్లతో ఆకతాయిల హల్​చల్​

తెలంగాణ రాష్ట్రం రాజేంద్రనగర్ నియోజక వర్గం అత్తాపూర్ మారుతీనగర్​లో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు రెచ్చిపోయారు. గంజాయి సేవిస్తూ... తల్వార్లతో దాడులకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేశారు.

ఎన్నికల కోడ్​ అమలులో ఉన్నప్పటికీ... మద్యం సేవించి, రోడ్డుపై వెళ్తున్న వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలని బస్తీవాసులు పోలీసులను కోరారు.

ఇదీ చూడండి:

'కొవిడ్ వ్యాక్సిన్​ వేసేందుకు వివరాలు తయారు చేయండి'

ABOUT THE AUTHOR

...view details