ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కత్తులతో దాడి.. తమ్ముణ్ని చంపిన అన్న - రాయచోటిలో తమ్ముడిని చంపిన అన్న వార్తలు

పేగు తెంచుకుని పుట్టిన ఆ ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి వ్యాపారం చేసుకునేవారు. అంతలోనే ఆస్తి తగదాలు తలెత్తాయి. అంతే మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తమ్ముడు మృతి చెందగా.. అన్న పరిస్థితి విషమంగా ఉంది. కడప జిల్లా రాయచోటిలో జరిగి ఈ సంఘటన.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.

younger-brother-killed-by-brother-in-kadapa-district
younger-brother-killed-by-brother-in-kadapa-district

By

Published : Feb 4, 2020, 12:02 AM IST

ఆస్తి వివాదంతో తమ్ముణ్ని చంపిన అన్న
పెద్దలు సంపాదించిన ఆస్తిని పంచుకోవడంలో తలెత్తిన వివాదం పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు అన్నదమ్ముల ప్రాణాల మీదకు తెచ్చింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆ ఇరువులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ప్రేమగా ఉంటూ ఆస్తి అనుభవించడమే కాకుండా వ్యాపార లావాదేవీలను కలిసిమెలసి చేసుకునేవారు. అలాంటిది ఒక్కసారిగా విరోధులై ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన కడప జిల్లా రాయచోటిలో జరిగింది.

మార్గమధ్యలోనే తమ్ముడు మృతి..

ట్రంక్ రోడ్ లో నివాసం ఉంటున్న కాయం కానీ రోప్​ఖాన్​కు ఐదుగురు కుమారులు ఉండగా మూడో కుమారుడు ఆరిఫుల్ఖా ఖాన్(46), ఐదో కుమారుడు సిభకతుల్లాఖాన్(35)ల మధ్య ఆస్తి కోసం వివాదం తలెత్తింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు కత్తులు, రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా.. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తమ్ముడు సిభకతుల్లా ఖాన్ మృతి చెందాడు. చికిత్స పొందుతున్న అన్న అరీఫులాఖాన్ పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details