ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో యువతి హైడ్రామా.. ప్రియుడి దగ్గరికి వెళ్లేందుకు వెరైటీ ప్లాన్​ - Young woman hydrama in RamgopalPet Secunderabad

ప్రియుడితో కలిసి వెళ్లేందుకు ఓ యువతి మాస్టర్​ ప్లాన్​ వేసింది. ఏకంగా తాను చనిపోతున్నట్లుగా లెటర్​ రాసి తన సొదరికి ఇచ్చి ప్రియుడి దగ్గరికి వెళ్లింది. ఈ ఘటన తెలంగాణలోని సికింద్రాబాద్​ రాంగోపాల్​ పేట్​ పీఎస్​ పరిధిలో జరిగింది.

ప్రియుడి దగ్గరికి వెళ్లేందుకు యువతి హైడ్రామా
ప్రియుడి దగ్గరికి వెళ్లేందుకు యువతి హైడ్రామా

By

Published : Nov 26, 2019, 11:38 AM IST

తెలంగాణలోని సికింద్రాబాద్​ రాంగోపాల్​ పేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ యువతి హైడ్రామా సృష్టించింది. నాలాలో పడి చనిపోతున్నట్లుగా లెటర్​ రాసి... ప్రియుడి దగ్గరకు వెళ్లింది.

అసలేం జరిగిందంటే...
తన సొదరితో ఉదయం 11 గంటలకు జేమ్స్​ స్ట్రీట్​ రైల్వేస్టేషన్​ వద్ద ఎంఎంటీఎస్​ ఎక్కిన యువతి... తనతో పాటు తెచ్చుకున్న లేఖ, నెక్లెస్​ను సోదరికి ఇచ్చింది. తాను సంజీవయ్య పార్కు వద్ద దిగింది. ఉత్తరాన్ని చూసిన సొదరి... తన అక్క నాలాలో పడిపోయిందని అనుకుంది. పోలీసులకు సమాచారం అందించగా... గత ఈతగాళ్లతో నాలాలో మృతదేహం ఉందేమోనని వెతికించారు. కానీ ఎలాంటి జాడ కనపడలేదు.

అనంతరం ప్రియుడితో వెళ్లిన యువతి సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్​చేసి... తాను క్షేమంగానే ఉన్నట్లు తెలిపింది. ప్రియుడితో వెళ్లినట్లు తెలపడంతో కథ సుఖాంతమైంది.

ప్రియుడి దగ్గరికి వెళ్లేందుకు యువతి హైడ్రామా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details