నవ్వుతూ..అందరినీ నవ్వించే..ఈ యువతి పేరు జన్ను శ్రీవేణి... వయస్సు(20). తెలంగాణ వరంగల్ పట్టణ జిల్లా హసన్ పర్తి మండలం.. ఇందిరాకాలనీ నివాసి. బీ ఫార్మసీ చదువుతోంది. గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదం.. శ్రీవేణిని జీవన్మృతురాలుగా చేసింది. లాభం లేదని బ్రెయిన్ డెత్ అయ్యిందని వైద్యులు చెప్పడంతో.. అవయవదాన ప్రతినిధుల సహకారంతో...శరీర అవయవాలను దాతలకిచ్చేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. రెండు కళ్లు, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయ భాగాలను.. అవసరమైన ఏడుగురికి ఇచ్చి వారికి కొత్త జీవితాన్ని అందించారు.
చనిపోయి బతికింది.. ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపింది - ఏడుగురికి అవయవ దానం చేసిన శ్రీవేణి
ఆ అమ్మాయి వయస్సు ఇరవై ఏళ్లు.. అయినా మనస్సు మాత్రం చాలా పెద్దది. తల్లిదండ్రుల మనస్సు ఇంకా గొప్పది. తాను చనిపోయి ఏడుగురికి అవయవాలిచ్చి.. కొత్త జీవితాన్నిచ్చింది. గర్భశోకాన్ని దిగమింగుకున్న తల్లిదండ్రులు అందుకు సహకరించి ధన్యజీవులు అయ్యారు.
చనిపోయి బతికింది.. ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపింది..
బాగా చదివి.. ప్రయోజకురాలు అవుతుందనుకున్న కుమార్తె.. అర్ధాయుష్కురాలు అవడం వల్ల.. తల్లిదండ్రులు వేదనకు అంతు లేకుండా పోయింది. శ్రీవేణిని తలుచుకుంటూ... కన్నీరుమున్నీరైతున్నా... ఆ బాధను దిగమింగుకుంటూ.. అవయవదానానికి అంగీకరించి తమ దొడ్డ మనసును చాటుకున్నారు.
ఇదీ చూడండి :8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు