తెలంగాణ: మక్తల్ శివారులో యువతి దారుణ హత్య - makthal latest news
తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ శివారులో యువతి దారుణ హత్యకు గురైంది. దుండగులు యువతిని చంపి.. తగులబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
యువతి కాలిపోయిన భాగాలు
తెలంగాణ నారాయణపేట జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మక్తల్ శివారులోని వడ్వాట్ గ్రామానికి వెళ్లే పాత రోడ్డు మార్గంలో ఓ యువతిని దుండగులు కాల్చిచంపారు. మద్యం మత్తులో యువతిని కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.
- ఇదీ చదవండి :పకోడి బండి వద్ద వివాదం.. బాలుడి మృతి