హైదరాబాద్లో కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుండగా... భోలక్ పూర్లోని కొందరు యువకులు కొవిడ్ పరీక్షా కేంద్రాన్ని తరలించాలని డిమాండ్ చేయడం అందరినీ తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్ రంగానగర్లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ఏడాదిగా కొనసాగుతున్న ఈ పరీక్ష కేంద్రాన్ని తమ బస్తీ నుంచి తరలించాలని కొందరు యువకులు సిబ్బందిపై దాడికి యత్నించారు. తమ బస్తీలో ఉన్న ఈ పరీక్షా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కరోనా బాధితులు రావడం వల్ల ప్రజలకు కరోనా వ్యాధి సోకుతుందని, కొందరు యువకులు సిబ్బందిపై దురుసుగా వ్యవహరించారు.
ఇదీ చదవండి: ఆ ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు మ్యూజిక్ థెరపీ!