స్నేహం చాటున మాయ ప్రేమకు మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. రాయపర్తి మండలం మొరిపిరాల గ్రామానికి చెందిన మైలపాక సందీప్ అనే యువకుడు గీసుగొండ మండలం మచ్చపూర్ గ్రామానికి చెందిన స్రవంతి అనే యువతి మాయమాటలకు (Lady Cheater) మోసపోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.
స్నేహితురాలిగా పరిచయమైన స్రవంతి.. సందీప్‌ను మచ్చిక చేసుకుని తనకు ఇద్దరు స్నేహితురాళ్లు ఉన్నారని నమ్మబలికింది. సదరు స్నేహితులతో ఫోన్లో మాట్లాడాలని సందీప్‌ను కోరింది. అసలు మర్మం తెలియని సందీప్ ఆ ఇద్దరి అమ్మాయిలతో విడివిడిగా ఫోన్లో మాట్లాడాడు. ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని స్రవంతి నమ్మబలికి ప్రియురాళ్ల అవసరాల నిమిత్తం సుమారు రూ. లక్ష వసూలు చేసింది.