విశాఖ జిల్లాలోని అనంతగిరి మండలం తాటిగూడ జలపాతం వద్ద విషాదం జరిగింది. సెల్ఫీ తీసుకుంటూ జలపాతంలో జారిపడి పువ్వుల రాణాప్రతాప్ (22) అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్ యూసఫ్‌గూడ లక్ష్మీనరసింహనగర్ వాసిగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. జలపాతం చూసేందుకు ఐదుగురు బీటెక్ విద్యార్థులు కారులో విశాఖకు వచ్చినట్లు తెలిసింది.
యువకుడి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా - విశాఖలో సెల్ఫీ మరణం
జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటూ జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. మృతుడి హైదరాబాద్‌కు చెందిన రాణాప్రతాప్‌గా గుర్తించారు.
vishakapatnam