ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ యువకుడి టాలెంట్​: రెండు చేతులతో.. నాలుగు భాషల్లో రాత. - Handwriting in four languages at once news

కంప్యూటర్ యుగంలో దాదాపుగా ప్రతి ఒక్కరూ చేతిరాతను మర్చిపోయి ఉంటారు. ఇలాంటి సమయంలోనూ... రెండు చేతులతో ఒక భాషలోనే కాకుండా ఒకేసారి నాలుగు భాషల్లో ఒక పదాన్ని రెండు చేతులతో రాస్తూ అబ్బురపరుస్తున్నాడు తెలంగాణలోని నారాయణపేట జిల్లా యువకుడు. ఒకటి సరిగ్గా మరొకటి రివర్స్‌గా రాస్తూ ప్రత్యేకతను చాటుతున్నాడు.

hand writing
రెండు చేతులతో నాలుగు భాషల్లో రాత

By

Published : Jan 25, 2021, 10:32 AM IST

తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గుడేబల్లూర్ చెందిన వాకిటి బస్వరాజ్... రెండు చేతులతో అతి సునాయసంగా ఒకే పదాన్ని నాలుగు భాషల్లో రివర్స్‌గా రాసి అబ్బురపరుస్తున్నాడు. అంబులెన్స్‌పై రివర్స్‌గా రాసి ఉండటం చూసి ఎందుకు ప్రయత్నించకూడదని మొదలుపెట్టాడు.

ప్రశంసలు...

ఈ ప్రయత్నంలో భాగంగానే ఒకే పదాన్ని నాలుగు భాషల్లో ఒకటి సరిగా మరోటి రివర్స్‌గా రాయడం అలవాటు చేసుకున్నాడు. ఇలా ఎవరు రాయడం లేదని తెలుసుకున్న బస్వరాజ్‌... ఏషియా రికార్డుతో పాటు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు సైతం పంపించాడు. వారు చేతిరాత ప్రతిభను గుర్తించి ఆన్‌లైన్‌లో ప్రశంసాపత్రాలు అందజేశారు.

గిన్నిస్​ లక్ష్యం...

బస్వరాజ్ కర్ణాటకలోని దేవాసుగుర్ థర్మల్ ప్లాంటులో ఉద్యోగం చేస్తున్నాడు. అతని చేతిరాత ప్రతిభను స్నేహితులు ప్రశంసిస్తున్నారు. చేతి రాత ప్రత్యేకత ద్వారా ఎప్పటికైనా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించాలనేది లక్ష్యమని.. బస్వరాజ్‌ చెబుతున్నాడు.

రెండు చేతులతో నాలుగు భాషల్లో రాస్తున్న యువకుడు

ఇదీ చూడండి:కాసేపట్లో.. వైకాపా ఎంపీలతో సీఎం జగన్ భేటీ

ABOUT THE AUTHOR

...view details