ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

New Decision: ఇక ఎవరి దస్తావేజు వారే రాసుకోవచ్చు..! - AP NEWS

New decision on Documents: భూములు, స్థలాల క్రయవిక్రయాల సమయంలో ఎవరి దస్తావేజు వారే రాసుకునే వెసులుబాటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏర్పాటుతో కార్యాలయాల్లో గంటలు గంటలు కూర్చోవాల్సి పని ఉండదు.

you-can-write-your-bond-in-the-sale-of-land
ఇక ఎవరి దస్తావేజు వారే రాసుకోవచ్చు..!

By

Published : Dec 28, 2021, 7:38 AM IST

భూములు, స్థలాల క్రయవిక్రయాల సమయంలో దస్తావేజు రాసేందుకు చాలామంది వేరొకరిపై ఆధార పడుతుంటారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఎవరి దస్తావేజు వారే రాసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనివల్ల కార్యాలయాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు.

  • రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ అధికారిక వెబ్‌సైట్‌ www.igrs.ap.gov.in లోకి వెళ్లి ముందుగా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఏర్పాటు చేసుకోవాలి.
    ఆ తరువాత వెబ్‌సైట్‌ ప్రధాన పేజీలో కింద కనిపించే పబ్లిక్‌ డేటా ఎంట్రీ ఐచ్ఛికాన్ని ఎంచుకోవాలి.
  • ఆ పేజీలో ‘మీ దస్తావేజు మీరే తయారు చేసుకోండి’ అని కనిపిస్తుంది. అక్కడ తొలుత రిజిస్ట్రేషన్‌ చేయించుకునే వారి వివరాల్ని దస్తావేజులో నమోదు చేయాలి. తరువాత ఆస్తి షెడ్యూలు వివరాలను పొందుపర్చాలి.
  • అక్కడే స్టాంపు డ్యూటీ(నగదు) లెక్కించి ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలి. నిబంధనల ప్రకారం షరతులు పూరించాలి.
  • వివరాలు నమోదైన తరువాత కంప్యూటర్‌ ద్వారా తయారైన ప్రింట్‌ తీసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాలి.
  • ముందుగా సమయం, తేదీని కూడా ఎంపిక చేసుకునే అవకాశం దీనిద్వారా ఉంది. గతంలో తెల్ల కాగితాలపై రాత కొలతలు, హద్దుల ఆధారంగా భూములు, స్థలాల విక్రయాలు జరుగుతుండేవి. ఇప్పుడు పక్కాగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని అధికారి వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

హెల్ప్‌ డెస్క్‌లు...

ఏమైనా ఇబ్బందులున్నా.. సందేహాలున్నా నివృత్తి చేసేందుకు అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు చేశారు.

అవగాహన పెరగాలి..

ఈ విధానంపై చాలామందికి అవగాహన లేదు. కొందరికి అంతర్జాలంపై పట్టు ఉన్నా మధ్యవర్తులనే ఆశ్రయిస్తున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కూడా స్లాటు బుకింగ్‌ ద్వారా కార్యాలయాల్లో నిరీక్షించకుండా వెంటనే పనులు పూర్తిచేసి పంపే చర్యలు తీసుకుంటుంది.

ఇదీ చూడండి:

వంగవీటి రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లతో భద్రత.. సీఎం జగన్ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details