ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యోగాకు దగ్గరగా... కరోనాకు దూరంగా - yoga day celebrations news in vizag

రాష్ట్రంలో పలుచోట్ల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని యోగా గురువులు సూచించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు మనిషి దినచర్యలో యోగా అనేది ఒక అంతర్భాగం కావాలని పలువురు పేర్కొన్నారు.

యోగాకు దగ్గరగా... కరోనాకు దూరంగా
యోగాకు దగ్గరగా... కరోనాకు దూరంగా

By

Published : Jun 21, 2020, 6:38 PM IST

కడప జిల్లా బద్వేలులో రామకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. ఉదయాన్నే యోగా గురువు అమర్నాథ్​రెడ్డి ఆసనాల ప్రాముఖ్యతను వివరించారు. యోగాపై ఆసక్తి ఉన్నవారు వస్తే ఉచితంగా నేర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. శ్రీకాకుళం భాజపా కార్యాలయంలో జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు కలిసి ఆసనాలు, ధ్యానం, ప్రార్థనలతో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒత్తిడిని జయించేందుకు యోగా గొప్ప సాధనమని, ప్రతి ఒక్కరూ ఆచరించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు అట్టాడ రవిబాబ్జి సూచించారు.

విశాఖపట్నం లాసన్స్ బే కాలనీలోని భాజపా కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశాఖ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ డాక్టర్​ కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, భాజపా రాష్ట్ర కార్యదర్శ సాగి కాశీవిశ్వనాథరాజు హాజరయ్యారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునేందుకు మనిషి దినచర్యలో యోగా అనేది ఒక అంతర్భాగం కావాలని యోగా గురువు రమేష్ తెలిపారు. 'ప్రాణాయామం' చేయడం వల్ల మనసును అధీనంలో నిలుపుకోవచ్చని చెప్పారు.

ఇదీ చూడండి:సైకత శిల్పంతో 'యోగా డే' సందేశం

ABOUT THE AUTHOR

...view details