ఒక్క అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ తమకు భవిష్యత్ లేకుండా చేశారని రాజధాని రైతులు వాపోయారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో రైతుల ధర్నా కొనసాగించారు. నిరసనలో భాగంగా రహదారిపై వంటా వార్పు నిర్వహించారు. వీరి ఆందోళనకు మంగళగిరి ఐకాస నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో జగన్ మాట నమ్మి మోసపోయామని మహిళా రైతులు వాపోయారు.
'సీఎంగా జగన్కు ఒక అవకాశమిచ్చి మోసపోయాం' - అమరావతి కోసం యర్రబాలెం రైతుల ధర్నా
ఎన్నికల సమయంలో జగన్ మాట నమ్మి మోసపోయామని అమరావతి ప్రాంతంలోని యర్రబాలెం గ్రామస్థులు వాపోయారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రోడ్డుపై వంటావార్పు చేపట్టారు.
అమరావతి కోసం యర్రబాలెం గ్రామస్థుల ధర్నా