పద్మశ్రీ రావడం కలా... నిజమా అన్నట్లు ఉంది: యడ్ల గోపాలరావు - పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం వార్తలు
పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం కలా... నిజమా అన్నట్టుగా ఉందని శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన రంగస్థల నటుడు యడ్ల గోపాలరావు ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి దాదాపు నాలుగున్నర దశాబ్దాలకుపైగా నాటకరంగానికి సేవలందించారు గోపాలరావు. 5,500కు పైగా నాటకాలు ప్రదర్శించిన ఆయనను... గతంలో రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు, కందుకూరి విశిష్ట పురస్కారాలతో సత్కరించింది. తాను పోషించిన పాత్రల్లో నారదుడి పాత్ర తనకెంతో ఇష్టమని గోపాలరావు అంటున్నారు. 'ఈటీవీభారత్'తో ముచ్చటించిన ఆయన తన అనుభవాలను పంచుకున్నారు.
yedla gopalrao express his happines get padmasri award