ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గాంధేయ మార్గంలో పోరాడండి.. ఆందోళన వద్దు' - ycp rebel mp raghu rama krishna raju comments

రాజధాని ప్రాంతాల ప్రజలు, రైతులు, మహిళలు ఆందోళన చెందవద్దని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. న్యాయం మీ పక్షాన ఉందని.. 3 రాజధానుల శంకుస్థాపన వాయిదా పడిందని చెప్పారు. సీఎం జగన్​ 3 రాజధానులపై పునరాలోచన చెయ్యాలని కోరారు.

గాంధేయ మార్గంలో ఆందోళన చెయ్యండి.. ఆందోళన చెందవద్దు: రఘురామకృష్ణరాజు
గాంధేయ మార్గంలో ఆందోళన చెయ్యండి.. ఆందోళన చెందవద్దు: రఘురామకృష్ణరాజు

By

Published : Aug 11, 2020, 6:05 PM IST

రాజధాని ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవద్దన్న రఘురామకృష్ణరాజు

3 రాజధానుల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడిందని వైకాపా రెబల్​ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అమరావతి రైతులు, మహిళలు ఆందోళన చెందవద్దన్నారు. న్యాయం మీ పక్షాన ఉందని.. గాంధేయ మార్గంలో ఆందోళన చెయ్యండి తప్ప.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజధానిపై కేంద్రానికి సంబంధం లేదనడం అసంబద్ధ వాదన అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికైనా 3 రాజధానులపై పునరాలోచన చేయాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details