PHOTOS: వైకాపా ప్లీనరీ ఫొటోలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ పోర్టల్ ap.gov.inలో ఉంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, పథకాలు, కార్యక్రమాలు, అధికారిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఉద్దేశించిన ప్రభుత్వ అధికారిక వెబ్ పోర్టల్‌లో పార్టీ ప్లీనరీకి సంబంధించిన రెండు చిత్రాలు ఉంచారు. ‘గుంటూరులో జరిగిన వైకాపా ప్లీనరీకి వైకాపా అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మతో కలసి హాజరైన ముఖ్యమంత్రి జగన్’ అని వాటికి క్యాప్షన్ పెట్టారు. రాజకీయ పార్టీ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో ఎలా పెడతారని వివిధ వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి.
PHOTOS: ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో 'వైకాపా ప్లీనరీ' ఫొటోలు
PHOTOS: ప్రజలకు సమాచారం అందించే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్ పోర్టల్‌లో వైకాపా ప్లీనరీ ఫొటోలను ఉంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇందులో ప్లీనరీకి సంబంధించిన రెండు చిత్రాలు ఉంచారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫొటోలు ఎలా పెడతారని వివిధ వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి.
AP PORTAL