పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని వైకాపా పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నాటికి 17,760 కుటుంబాలకు పునరావాస ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు ట్విటర్లో తెలిపారు.
ఒక్కో కుటుంబానికి 2 ఎకరాల పంట భూమి, 6.36 లక్షల పరిహారం ఇస్తున్నట్లు వెల్లడించారు. పోలవరం పూర్తి చేసేది సీఎం వైఎస్ జగనేనని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు కొనుగోలు కోసం మార్క్ ఫెడ్‌కు 200 కోట్లు కేటాయించి.. సీఎం జగన్ రైతుల పట్ల తన అభిమానాన్ని మరోమారు చాటారని పేర్కొన్నారు.