దిల్లీలో మీడియాతో వైకాపా ఎంపీలు దేశంలో భాజపా చాలా బలంగా ఉందని వైకాపా ఎంపీ తలారి రంగయ్య అన్నారు. వైకాపాపై ఆధారపడాల్సిన అవసరం ఆ పార్టీకి లేదని వెల్లడించారు. అందువల్ల తాము రాజీనామాలు చేస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని స్పష్టం చేశారు. మీడియా ప్రతినిధి అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.
'అమరావతి వల్ల సిగ్గు పడాల్సి వస్తోంది'
అమరావతిలో కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేవని వైకాపా ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అలాంటి ప్రాంతాన్ని రాజధానిగా చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అమరావతి అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అంత ఖర్చు భరించలేకనే సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
'కేంద్రం మెడలు వంచుతామన్నారు... ఇప్పుడు మాట్లాడరెందుకు?'