వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రూ.20కోట్లకు అమ్ముడుపోయారని విజయసాయి చేసిన వ్యాఖ్యలపై కన్నా తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమని.. లాక్ డౌన్ ముగియగానే తేదీని ప్రకటిస్తానని ఘూటుగా జవాబుచ్చారు. విజయసాయి కూడా ఆయన వ్యాఖ్యలకు కట్టుబడి కాణిపాకం వినాయకుడి ఎదుట ప్రమాణం చేయాలని కోరారు. ఇందుకు స్పందించిన విజయసాయిరెడ్డి... 'కన్నా.. కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్' అంటూ ట్వీట్ చేశారు.
కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?: విజయసాయి - kanna vijayasai reddy twitter war news
'కన్నా... కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్' అంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి మరో బాంబ్ పేల్చారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా రూ.20 కోట్లకు అమ్ముడుపోయారంటూ విజయసాయి చేసిన వ్యాఖ్యలపై ఇరువురి మధ్య తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ycp mp vijayasai reddy