వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి... ఆసక్తికర ట్వీట్ చేశారు. తెదేపా నుంచి వచ్చే మిడతల దండుతో భాజపా జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా హెచ్చరిస్తూ పోస్టు చేశారు. ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న తెదేపా మిడతల దండు కమలం వైపు కదులుతోందన్నారు.
ఇప్పటికే కొన్ని మిడతల ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే... మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయని సెటైర్లు విసిరారు. ఈ విప్తతు నుంచి భాజపా ఎలా బయటపడుతుందో చూడాలంటూ పేర్కొన్నారు... విజయసాయి.