వైకాపా ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బాగోలేదని వ్యాఖ్యానిస్తే, ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం విభిన్నంగా స్పందించారు. కేంద్ర బడ్జెట్‌లో చక్కటి ప్రణాళిక ఉందన్నారు. రాష్ట్రం ఆశించినవి బడ్జెట్‌లో కనిపించాయని అన్నారు. వివిధ పథకాల కింద ఇచ్చిన నిధుల్లో అధిక మొత్తం రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తామని వ్యాఖ్యానించారు.
రాష్ట్రం ఆశించినవి కేంద్ర బడ్జెట్‌లో కనిపించాయి: వైకాపా ఎంపీ - ఎంపీ రఘరామకృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్ బాగుందని నరసాపురం ఎంపీ రఘరామకృష్ణంరాజు అన్నారు. బడ్జెట్ చక్కటి ప్రణాళికతో ఉందన్నారు.
YCP mp ragu rama krishnamaraju comments on central budjet
"బడ్జెట్ చాలా బాగుంది. నేను సభలో చాలా ఎక్కువసార్లు చప్పట్లు కొట్టాను. జీడీపీ రేటు ఐదు శాతం ఉన్నప్పటికీ...10 శాతం ఎలా చేయాలో చెప్పేలా... చక్కటి ప్రణాళికతో ఉంది. రైతే వెన్నెముక అని చెప్పటం కాదు...చేతల్లో చూపేలా ఈ బడ్జెట్ ఉంది. ఇచ్చిన కేటాయింపుల్లో అధిక నిధులు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తాం"- రఘరామకృష్ణంరాజు, వైకాపా ఎంపీ
ఇదీ చదవండి :కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి: ఎంపీ విజయసాయిరెడ్డి