ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

షోకాజ్​ నోటీసుపై సీఎంకు సమాధానం ఇవ్వనున్న ఎంపీ

పార్టీ విధానాలపై బహిరంగ విమర్శలు చేసిన ఆరోపణలపై తనకు జారీ అయిన షోకాజ్​ నోటీసుపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్​కు ఇవాళ 12 గంటలలోపు సమాధానం ఇవ్వనున్నారు. తనకు కలిసే అవకాశం ఇస్తే.. అన్నీ వివరిస్తానన్న ఎంపీ.. అవకాశం లేకుంటే మెయిల్​ ద్వారా సమాధానం పంపనున్నట్లు తెలిపారు.

షోకాజ్​ నోటీసుపై సీఎంకు సమాధానం ఇవ్వనున్న ఎంపీ
షోకాజ్​ నోటీసుపై సీఎంకు సమాధానం ఇవ్వనున్న ఎంపీ

By

Published : Jun 29, 2020, 10:32 AM IST

ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేశారన్న ఆరోపణలపై తనకు జారీ అయిన షోకాజ్​ నోటీసుపై వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. సీఎం జగన్​కు మధ్యాహ్నం 12 గంటలలోపు సమాధానం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఇస్తే.. అన్నీ వివరిస్తానని ఇప్పటికే చెప్పిన ఎంపీ.. ఒకవేళ అవకాశం ఇవ్వకుంటే మెయిల్​ ద్వారా పంపనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే విజయసాయికి సమాధానం

ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారన్న ఆరోపణలపై రఘురామకృష్ణరాజుకు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. వారం క్రితం షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన రఘురామకృష్ణరాజు.. పార్టీ పేరుకు తనకు ఇచ్చిన లెటర్​ హెడ్​కు పొంతన లేదని సమాధానం ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వం నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందిని సీఎం దృష్టికి తీసుకెళ్లానని రఘురామకృష్ణరాజు తెలిపారు. ముఖ్యమంత్రికి, పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ.. ఎక్కడా మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్​ నోటీసుపై కొద్ది రోజుల క్రితం దిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో రఘురామకృష్ణరాజు భేటీ అయి చర్చించారు.

ఇదీ చూడండి..

జులై 1న కొత్త అంబులెన్స్‌లు ప్రారంభించనున్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details