సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ - ycp raghuramakrishna raju filed petition on high court
![సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7871019-677-7871019-1593751668998.jpg)
09:28 July 03
హైకోర్టుకు ఎంపీ రఘురామకృష్ణరాజు
తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని పేర్కొన్నారు. యువజన శ్రామిక రైతు పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు ఇవ్వలేదన్న రఘురామకృష్ణరాజు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లెటర్‌హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్న హైకోర్టు.. సోమవారం రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి..
సీఎం జగన్ కనుసన్నల్లోనే అంతా జరుగుతోందనిపిస్తోంది: రఘురామకృష్ణరాజు