తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో ముఖ్యమంత్రి పోల్చడం బాధాకరమని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని స్పష్టం చేశారు.
ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు నేతలు అడ్డుకుంటున్నారని సీఎం చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజధాని రైతులు మరణిస్తున్నందున వారికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్పై ఉందన్నారు.