విజయనగరం జిల్లా రామతీర్థంలో దేవుడి విగ్రహాల ధ్వంసంపై పారదర్శకంగా విచారణ చేయించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం చేయడమే కాదని... న్యాయం చేసినట్లు ప్రజలకు కనబడాలని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం ఏమి చెబితే అది చేసే సీఐడీ సంస్థచే ఆ ఘటనను విచారణ చేయించడం సరికాదన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేని స్వతంత్ర సంస్థకు ఆ ఘటన దర్యాప్తును అప్పగించాలని కోరారు. రెడ్డి, క్రైస్తవ వర్గాలకు చెందని వారినే విచారణాధికారిగా నియమించాలని డిమాండ్ చేశారు.