MP RRR LETTER: సీఎం జగన్‌ను వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ.. ప్లీనరీలో చేసిన తీర్మానాన్ని అమలు చేయకుండా నిలువరించాలని.. ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు లేఖ రాసిన ఆయన.. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిరక్షణకుగానూ శాశ్వత అధ్యక్ష నియామకాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ తీర్మానం ద్వారా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ప్రాథమిక నిబంధలను తమ పార్టీ ఉల్లంఘించిదని అధికారులకు రఘురామ ఫిర్యాదు చేశారు. చట్ట స్ఫూర్తికి విరుద్ధంగా ప్లీనరీలో శాశ్వత అధ్యక్ష తీర్మానాన్ని ఆమోదించారన్న వైకాపా ఎంపీ.. పార్టీ నియమ నిబంధనలు మార్చిన సమాచారం ప్లీనరీలో తెలియజేయలేదని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శాశ్వత అధ్యక్ష నియామకానికి అనుమతించొద్దని కోరారు. అయితే వైకాపా నుంచి ఎటువంటి తీర్మానం ఇప్పటివరకు అందలేదని ఈసీఐ అధికారులు తెలిపారని, శాశ్వత అధ్యక్ష నియామకం చెల్లదని కూడా అధికారులు చెప్పినట్లు రఘురామ వెల్లడించారు.
వైకాపా జీవిత కాల అధ్యక్ష నియామకాన్ని నిలిపివేయండి: ఎంపీ రఘురామ - ఎంపీ రఘురామ తాజా వార్తలు
MP RRR LETTER: వైకాపా ప్లీనరీలో ముఖ్యమంత్రి జగన్‌ను.. జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని అమలుచేయకుండా చూడాలని ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ తీర్మానం ద్వారా 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ప్రాథమిక నిబంధలను తమ పార్టీ ఉల్లంఘించిదని అధికారులకు రఘురామ ఫిర్యాదు చేశారు.
MP RRR