ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కిశోర్‌ మృతిపై అనుమానం... స్పందించాలి ప్రభుత్వం​' - నలంద కిశోర్ మృతి వార్తలు

ఎలాంటి తప్పు చేయకున్నా విశాఖలో నలంద కిశోర్​ను క్రిమినల్​ మాదిరిగా పోలీసులు ఇబ్బందులు పెట్టారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ప్రతి చిన్నదానికి ఐపీసీలో ఉన్న సెక్షన్లన్నీ పెట్టి వేధిస్తున్నారని వ్యాఖ్యానించారు. కిశోర్ మృతికి కారకులైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ycp mp raghu rama krishnam raju
ycp mp raghu rama krishnam raju

By

Published : Jul 25, 2020, 12:49 PM IST

Updated : Jul 25, 2020, 1:02 PM IST

విశాఖలో నలంద కిశోర్‌ మృతినన్ను ఎంతగానో కలచివేసిందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. కిశోర్‌ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్టుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగా లేకున్నా విశాఖ నుంచి కర్నూలుకు తీసుకెళ్లారని చెప్పారు. కర్నూలుకు కిశోర్‌ను తరలించిన సమయంలో అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని...వైరస్ బారిన పడే కిశోర్‌ చనిపోయారని తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ పోలీసు హత్యగానే భావించాలని అన్నారు. పోలీసుల చర్యలతో స్నేహితుడు కిశోర్​ను కోల్పోవడం బాధాకరమని తెలిపారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవించే హక్కును హరింపచేస్తున్నారా..? అని ప్రశ్నించారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతగా జగన్‌ విమర్శించారని గుర్తు చేశారు. పోలీసుల దమనకాండను ప్రభుత్వాధినేతగా జగన్‌ ఆపివేయాలని కోరారు. పోలీసుల చర్యలతో ప్రాణాలు పోయే పరిస్థితి తీసుకురావడం శోచనీయమన్నారు. సహించలేని స్థితికి వెళ్తే ప్రజలు ఎదురుతిరిగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

'కిశోర్‌ మృతిపై అనుమానం... స్పందించాలి ప్రభుత్వం​'

క్రిమినల్‌ మాదిరిగానలంద కిశోర్‌ను ఇబ్బందిపెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. ప్రతి చిన్నదానికి ఐపీసీలో ఉన్న సెక్షన్లన్నీ పెట్టి వేధిస్తున్నారు. ప్రజలకు మాట్లాడే హక్కు, జీవించే హక్కుకు భంగం కలగకుండా చూడాలి. ప్రజల బాధలను దయచేసి ముఖ్యమంత్రి అర్థంచేసుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థలను కాలరాయడం మంచి పద్ధతి కాదు. ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతున్నాయా..? పోలీసులపై ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి- ఎంపీ రఘురామకృష్ణరాజు

Last Updated : Jul 25, 2020, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details