వైకాపా అధిష్టానం జారీ చేసినషోకాజ్ నోటీసుపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. 18 పేజీల నోటీసులో రెండు పేజీలు రాతపూర్వకంగా ఉంటే... మిగతా 16 పేజీలు వివిధ పత్రికా క్లిప్పింగ్లు జతపరిచారన్నారు. తాను పార్టీపై, అధ్యక్షుడినిగానీ ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు కొన్నిచోట్ల సజావుగా అమలుకావట్లేదని సూచనలు చేశానని వ్యాఖ్యానించారు. సీఎం అపాయింట్‌మెంట్ దొరకనందునే మీడియా ముఖంగా తెలియజేశానని వివరించారు.
పార్టీని, అధ్యక్షుడినిగానీ పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు - ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు
![పార్టీని, అధ్యక్షుడినిగానీ పల్లెత్తు మాట అనలేదు :ఎంపీ రఘురామకృష్ణరాజు YCP mp raghu ram krishnam raju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7753938-881-7753938-1593002664221.jpg)
YCP mp raghu ram krishnam raju
18:03 June 24
షోకాజ్ నోటీసుపై స్పందించిన వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
ఎంపీ రఘురామకృష్ణరాజు
'నేను ప్రభుత్వానికి సూచనలు చేశానే తప్ప పార్టీకి కాదు. దేవాలయ భూముల విషయం, ఇతర అంశాలను సీఎంకు సూచనపూర్వకంగా తెలియజేశా. పార్టీని, అధ్యక్షుడిని పల్లెత్తు మాట అనలేదు, అదే వివరణ రేపు అందిస్తా. నాకు 7 రోజుల సమయం ఇచ్చినా గురువారమే సమాధానం పంపుతా' - రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
ఇదీ చదవండి:
Last Updated : Jun 24, 2020, 6:24 PM IST