ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యులు : రఘురామకృష్ణరాజు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యతిరేకించారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఎందుకు చొరవ చూపుతున్నారని ప్రశ్నించారు.

ycp mp raghr rama krishna raju fire on ap government
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

By

Published : Apr 30, 2021, 5:14 PM IST

రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్నా.. పదోతరగతి పరీక్షలు నిర్వహించే దిశలో ప్రభుత్వం ముందుకు వెళ్లడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణమరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్ధులకు ఎమైనా అయితే.. ఎవ్వరు బాధ్యులని ప్రశ్నించారు. పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. అక్కడికి రావడానికి బస్సునో, ఆటోనో పట్టుకుని రావాల్సిందే కదా అని ప్రశ్నించారు. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఎందుకు చొరవ చూపుతున్నారని నిలదీశారు. నియంతలా వ్యవహరించడం జగన్మోహన్‌ రెడ్డికి తగదన్నారు. రాష్ట్రంలో పరీక్షలు తగ్గాయని.. దొంగ లెక్కలు ఇవ్వొద్దని ఆయన డిమాండ్‌ చేశారు. పరీక్షలు వాయిదా పడతాయన్న విశ్వాసం తనకుందరి రాజు ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details