ప్రత్యేక హోదాపై పార్లమెంటులో గళమెత్తాలని సీఎం జగన్ సూచించారని వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి పోలవరం నిర్మాణానికి రావాల్సిన బకాయిలు వచ్చేలా చూడాలని సీఎం చెప్పారన్నారు. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ వ్యవహరించాల్సిన విధానంపై సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారన్నారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం వచ్చేలా ఒత్తిడి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని మిథున్ రెడ్డి చెప్పారు. ఈ అంశాలపై త్వరలోనే కేంద్రమంత్రులను కలుస్తామని ఎంపీ అన్నారు.
రఘురామకృష్ణరాజును మేం సస్పెండ్ చేయం : ఎంపీ మిథున్ రెడ్డి - ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు
పార్లమెంటు వర్షాకాల సమావేశంలో పార్టీ విధివిధానాలపై సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలు, జీఎస్టీ పెండింగ్ బకాయిల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఎంపీ స్పష్టం చేశారు. వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరతామన్నారు.
జీఎస్టీ పెండింగ్ బకాయిలపై అధికారులతో మాట్లాడతాం. గరీబ్ కల్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు ఇచ్చేలా ఒత్తిడి తెస్తాం. ప్రతి పార్లమెంటు స్థానంలో వైద్య కళాశాల ఏర్పాటుకు మద్దతు కోరతాం. మండలి రద్దు బిల్లు, దిశా బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలి. రఘురామకృష్ణరాజుపై త్వరగా అనర్హత వేటు వేయాలి. రఘురామకృష్ణరాజు ప్రతిపక్షాల అజెండా మేరకు నడుస్తున్నారు. రఘురామకృష్ణరాజును మేం సస్పెండ్ చేయం. - మిథున్ రెడ్డి, వైకాపా ఎంపీ
ఇదీ చదవండి :మమ్మల్ని కాపాడండి.. ప్రధానికి అమరావతి రైతుల లేఖ