వైకాపా సభ్యుడు మిథున్‌రెడ్డి మాట్లాడుతూ... ‘2014 ఎన్డీయే మేనిఫెస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి మోదీ తిరుపతిలో హామీ ఇచ్చారు. మేం ప్యాకేజీలను అంగీకరించడం లేదు. చట్టం అమలుకు పదేళ్ల గడువుంటే ఇప్పటికే ఏడేళ్లు పూర్తయ్యాయి. చాలా అంశాలు ఇంకా పూర్తి చేయలేదు. అందుకు కారణాలేంటో తెలియడం లేదు. మేం ప్రత్యేక హోదానే డిమాండు చేస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
నిత్యానందరాయ్ సమాధానమిస్తూ ‘ప్రత్యేక హోదా విధానాన్ని 14వ ఆర్థిక సంఘం రద్దు చేసింది. కానీ ఏపీ ప్రగతికి కేంద్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్యాకేజీ రూపంలో పెద్ద మొత్తాన్ని ఇచ్చింది’ అని తెలిపారు.
ప్యాకేజీ అంగీకరించడం లేదు: వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి - ఏపీకి ప్రత్యేక హోదా తాజా వార్తలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో అన్నారు. ప్రధాన మంత్రి మోదీ తిరుపతిలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తాము ప్యాకేజీలను అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.
![ప్యాకేజీ అంగీకరించడం లేదు: వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి ycp mp mithun reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11133720-399-11133720-1616550108043.jpg)
ycp mp mithun reddy