ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravati: అమరావతి ఎస్సీ ఐకాస నేతపై వైకాపా ఎంపీ అనుచరుల దాడి - YCP MP followers on amaravathi SC JAC leader

అమరావతి ఎస్సీ ఐకాస నేత పులి చిన్నాపై దాడి జరిగింది. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై ఫిర్యాదు చేసినందుకు ఎంపీ నందిగాం సురేశ్‌ అనుచరులు దాడి చేశారని చిన్నా ఆరోపించారు. దాడిలో గాయపడి విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నచిన్నాను చంద్రబాబు ఫోన్​లో పరామర్శించారు.

అమరావతి ఎస్సీ ఐకాస నేతపై వైకాపా ఎంపీ అనుచరుల దాడి
అమరావతి ఎస్సీ ఐకాస నేతపై వైకాపా ఎంపీ అనుచరుల దాడి

By

Published : Sep 19, 2021, 8:36 AM IST

అమరావతి ఎస్సీ ఐకాస నేత పులి చిన్నాపై దాడి జరిగింది. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనలో వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై ఫిర్యాదు చేసినందుకు ఎంపీ నందిగాం సురేశ్‌ అనుచరులు దాడి చేశారని చిన్నా ఆరోపించారు.

చిన్నాను ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు

దుండగుల దాడిలో గాయపడి విజయవాడ ఆయుష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సీ నేత పులి చిన్నాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. అరాచక ప్రభుత్వంపై చిన్నా వీరోచితంగా పోరాడుతున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. దాడికి సంబంధించి పోలీసు కేసు, రక్షణ ఏర్పాట్లు పర్యవేక్షించాలని పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యకు చంద్రబాబుకు సూచించారు.

ఇదీచదవండి.

CASE ON TDP LEADERS : తెదేపా నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

ABOUT THE AUTHOR

...view details