ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులను వైకాపా ప్రకటించింది. మూడు ఖాళీలను భర్తీ చేసేందుకు ముగ్గురు అభ్యర్ధుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. శ్రీకాకుళం నుంచి మాజీ డీసీసీబీ ఛైర్మన్ పాలవలస విక్రాంత్, కర్నూలు జిల్లా నంద్యాల మార్కెట్ యార్డు ఛైర్మన్ ఇషాక్ బాషా, కడప జిల్లా బద్వేలుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్లను తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారన్నారు. స్థానిక సంస్థలకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను రెండు రోజుల్లో వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా పేర్లు కొలిక్కి వచ్చాయని రిజర్వేషన్లు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే పేర్లను ప్రకటిస్తామని చెప్పారు.
MLC candidates : ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా
19:42 November 10
ముగ్గురి పేర్లు ఖరారు
పీఆర్‌సీపై ప్రక్రియ ప్రారంభమైంది..
ఉద్యోగుల పీఆర్‌సీపై ప్రక్రియ ప్రారంభమైందని... ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సజ్జల అన్నారు. గత నెలాఖరులో ప్రకటించాలని అనుకున్నామని... కానీ వీలుకాలేదని... ఇది పెద్ద అంశం కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నారని... సచివాలయంలో ఉద్యోగ సంఘాలు సీఎస్ రాక కోసం నిరీక్షిస్తున్నట్లు తనకు తెలిసిందని చెప్పారు. పీఆర్‌సీ ప్రక్రియ కొంత ముందుగా మొదలై ఉంటే బాగుండేదని...సామరస్యంగానే ఫలితం ఉంటుందని తెలిపారు
ఇదీచదవండి: BJP leaders protest: సీఐ ఇస్మాయిల్‌ను సస్పెండ్ చేయాలి: భాజపా