ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని.. వైకాపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. తెదేపా తలపెట్టిన చలో ఆత్మకూరు పర్యటనకు పోటీగా వైకాపా తలపెట్టిన యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో.. వారు స్పందిస్తూ పరిస్థితులు చక్కబడ్డాక.. పోలీసుల అనుమతితోనే ఆత్మకూరులో పర్యటించి... వాస్తవాలు తెలుసుకుంటామన్నారు. పల్నాడును రాజకీయ లబ్ధి కోసం తెదేపా వాడుకుంటోందని.. వాస్తవానికి తెదేపా పల్నాడుకు చేసింది ఏమి లేదని అన్నారు.
పల్నాడులో శాంతి భద్రతలపై తాము చర్చలకు సిద్ధమని.. తెలుగుదేశం పార్టీ తమ సవాల్ ను స్వీకరించాలని అన్నారు. ఆత్మకూరులో 127 బాధిత కుటుంబాలు ఉన్నాయని.. చంద్రబాబు చెప్పడం అబద్ధమని అన్నారు. అదే నిజమని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేస్తానని.. లేకుంటే మాజీ ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సవాలు చేశారు.