బడుగు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసమే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారని వైకాపా ఎమ్మెల్యే పి.జె.ఆర్ సుధాకర్ బాబు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీల నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంగ్ల విద్యను వ్యతిరేకిస్తోన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. తన పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని హితవు పలికారు.
"పవన్ గారూ.. మీ పిల్లలతో ఏ భాషలో మాట్లాడుతున్నారు?" - english medium policy implemented in AP news
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను వ్యతిరేకిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఆయన పిల్లలను ఏ పాఠశాలలో చదిస్తున్నారో చెప్పాలని వైకాపా ఎమ్మెల్యే పి.జె.ఆర్ సుధాకార్ బాబు డిమాండ్ చేశారు.
ycp mla sudhakar babu fire on pawan kalyan