తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కరోనా నివారణకు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా... బురద చల్లడమే ధ్యేయంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రంలో కూర్చొని ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ర్యాపిడ్ కిట్ల విషయంలోనూ తెదేపా నేతలు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తోందని స్పష్టం చేశారు. జగన్ పాలనపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తుంటే... చంద్రబాబు నాయుడు ఓర్వలేక హైదరాబాద్లో కూర్చొని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
హైదరాబాద్లో కూర్చొని ప్రభుత్వంపై విమర్శలా?: శ్రీకాంత్ రెడ్డి - ap corona cases total
కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా... చంద్రబాబు విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో కూర్చొని ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.
ycp mla srikanth reddy