ఐటీ దాడుల్లో వేల కోట్ల అక్రమాలు బయటపడిన దృష్ట్యా తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయాలని వైకాపా డిమాండ్ చేసింది. అక్రమాలు బయటపడిన కారణంగానే హడావుడిగా ఆస్తులు ప్రకటించారని ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. నారా లోకేశ్ ఆస్తులను ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తులను ప్రకటించారని ఆరోపించారు. అహ్మద్ పటేల్‌కు డబ్బులు పంపారనే అంశం తెర మీదకు రాగానే ఆస్తులు ప్రకటించారని ఆరోపించారు.
అందుకే హడావుడిగా ఆస్తులు ప్రకటించారు: శ్రీకాంత్‌రెడ్డి - Srikanth Reddy latest news
అక్రమాలు బయటపడిన కారణంగానే లోకేశ్ ఆస్తులు ప్రకటించారని ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు బృందం రూ.7 లక్షల కోట్ల మేర దోపిడీ చేసిందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడారు.
బినామీ పేర్లకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తనపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధమేంటో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు చేసేది ప్రజాచైతన్య యాత్ర కాదని... బినామీల ఆత్మరక్షణ యాత్ర అని విమర్శించారు. ఏపీ బ్రాండ్‌ను దెబ్బ తీసేందుకు కుట్రలు చేస్తున్న చంద్రబాబు ఆగడాలను త్వరలోనే బయటపెడతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ... వైకాపా దౌర్జన్యాలు అప్రజాస్వామికం: చంద్రబాబు