రాయలసీమ ప్రజలను అవమానపరిచిన చంద్రబాబు... అక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైకాపా డిమాండ్ చేసింది. ఆ తర్వాతే కడప జిల్లాలో పర్యటించాలని వైకాపా నేత, ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఐదేళ్లలో ఏం చేశారని కడప జిల్లాలో పర్యటిస్తున్నారో చెప్పాలన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు ధైర్యం, నమ్మకం ఉంటే అవినీతి కేసులపై ఉన్న స్టేలను ఎత్తివేయించుకుని విచారణ సిద్ధం కావాలని సవాల్ చేశారు. వివేకా హత్య కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నారని... త్వరలో అన్ని విషయాలు బయటపెడతాయన్నారు.
'ఏం చేశారని కడప జిల్లాలో పర్యటిస్తున్నారు..?' - కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన వార్తలు
ఐదేళ్లలో ఏం చేశారని చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారని... ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు.
ycp-mla-srikanth-reddy-comments-on-chandrababu-over-kadapa-district-tour