అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో నెలకొన్న ఇసుక సమస్యను పరిష్కరించాలంటూ స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు లేఖ రాశారు. ఇసుక కొరత కారణంగా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు ఆగిపోయాని తెలిపారు. రహదారి మరమ్మతులు, హంద్రీనీవా కాలువ పనులు ముందుకు సాగటం లేదని వివరించారు. ఇసుక కొరత ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు. పరిస్థితిని గుర్తించి ఇసుక సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.
ఇసుక కొరతపై కలెక్టర్‌కు వైకాపా ఎమ్మెల్యే లేఖ - కదిరి నియోజకవర్గంలో ఇసుక కొరత వార్తలు
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో నెలకొన్న ఇసుక సమస్యను పరిష్కరించాలంటూ స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. ఇసుక కొరత కారణంగా అభివృద్ధి పనులు ఆగిపోయాని తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.
MLA_Requst_For_Sand