ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం ఉందని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో మాట్లాడిన ఆమె... ఎన్నికల కమిషనర్ వెనుక ఎవరున్నారో తెలుసుకుని.. ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాము ఎన్నికలకు భయపడమని కేవలం.. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని కోరామన్నారు. సుప్రీం తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందనే అనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దమేనన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే: వైకాపా ఎమ్మెల్యే రోజా - ycp mla roja vissts tirumala news
తాము ఎన్నికలకు భయపడే ప్రస్తక్తే లేదని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. కేవలం ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరామన్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ycp mla roja slams sec nimmagadda