ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోలీసులపై వైకాపా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు - గుంటూరు వార్తలు

వైకాపా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. గతంలో తమపై తప్పుడు కేసుల పెట్టారని...తీరా అధికారంలోకి వచ్చాక కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

mla mahesh reddy
వైకాపా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

By

Published : Oct 12, 2020, 10:13 AM IST

Updated : Oct 12, 2020, 6:47 PM IST

వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అభినందించాల్సింది పోయి పదే పదే విమర్శించటం, ఆరోపణలు చేయటం తగదని వైకాపా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గుంటూరు జిల్లా దాచేపల్లిలో అన్నారు. అభివృద్ధికి సంబంధించి చర్చకు సిద్ధమా అంటూ...మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి సవాల్ విసిరారు. తమ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదన్నారు. గురజాలను ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికపరంగా ముందుకు వెళ్తున్నట్లు మహేష్ రెడ్డి పేర్కొన్నారు.

వైకాపా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

అనంతరం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మహేష్ రెడ్డి. గతంలో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని...తీరా అధికారంలోకి వచ్చాక కాళ్లు పట్టుకుంటే క్షమించి వదిలేశామని ఆయన అన్నారు.

Last Updated : Oct 12, 2020, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details