రాష్ట్ర రాజధానిని ఎవరూ తరలించడం లేదని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పష్టం చేశారు. రాజధానిని కదిలిస్తే రాష్ట్రం... పనామా, వెనెజులా స్థాయికి వెళ్తుందన్న సుజనా చౌదరి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. భాజపా ఎంపీ సుజనాచౌదరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవని జోగి రమేశ్ హెచ్చరించారు. మచిలీపట్నం పోర్టు ప్రారంభిస్తామని... ఇబ్రహీంపట్నం- చినకాకాని మధ్య 6 వరుసల రహదారి వస్తోందని తెలిపారు. రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. అమరావతి పెద్దఎత్తున అభివృద్ధి చెందుతోందని జోగి రమేశ్ అభిప్రాయపడ్డారు.
'అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తే... చర్యలు తప్పవు' - జోగి రమేశ్ వార్తలు
రాజధానిని కదిలిస్తే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని భాజపా ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై... వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ మండిపడ్డారు. రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
జోగి రమేశ్