భూ ఆక్రమణలపై అధికారులు వారి బాధ్యతను వారు నిర్వహిస్తే... తెదేపా నేతలు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని వైకాపా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అధీప్రాజ్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అమర్నాథ్... గీతం యూనివర్సిటీ 40 ఎకరాల భూమిని ఆక్రమించడాన్ని ఖండించారు. బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు భూమి స్వాధీనం చెసుకుంటే... తెదేపా నేతలు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.
భూ ఆక్రమణలు తొలగిస్తే తెదేపా నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక ప్రైవేట్ యాజమాన్యం భూమి అక్రమిస్తే... వాటిని స్వాధీనం చేసుకోవడం తప్పా అని ప్రశ్నించారు.వందల కోట్లు విలువ చేసే భూమిని అక్రమిస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. విశాఖలో విలువైన భూములు కాపాడుతామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని...ఆ మేరకు ఎవరు ఆక్రమణలకు పాల్పడినా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.