ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు: ఎమ్మెల్యే భూమన - భూమన కరుణాకర్ రెడ్డి

వరవరరావు విషయంలో భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దియోధర్‌ వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. వరవరరావుపై జాలి చూపమని కోరానని...అది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు.

Ycp MLA Bhumana Karunakar Reddy
Ycp MLA Bhumana Karunakar Reddy

By

Published : Aug 30, 2020, 3:37 PM IST

వరవరరావు విషయంలో భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దియోధర్‌ వ్యాఖ్యలపై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. ప్రధాని హత్యకు కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం తన ఉద్దేశం కాదన్న భూమన.. 81 ఏళ్ల వరవరరావుపై జాలి చూపమనే కోరానని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్​తోనే ప్రారంభమైందని... వెంకయ్యనాయుడు, వరవరరావుతో కలిసి జైలులో ఉన్నానని గుర్తు చేశారు. అందుకే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు లేఖ రాశానని వివరణ ఇచ్చారు. తన వ్యక్తిగత అభిప్రాయాన్ని సీఎంతో ముడిపెట్టడం బాధించిందని భూమన అన్నారు.

సునీల్ దియోధర్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details