వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన వెల్లడించారు. జులై మాసంలో కొవిడ్ బారిన పడి కోలుకున్నానని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కరోనా పరీక్షలు నిర్వహించగా... పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. రీ ఇన్ఫెక్షన్కి గురి కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. అవసరమైతే ఆస్పత్రిలో చేరతానని.. మరోసారి కొవిడ్‌ను జయిస్తానని ట్వీట్ చేశారు.
మరోసారి కరోనా బారిన పడ్డ వైకాపా ఎమ్మెల్యే అంబటి
వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మరోసారి కరోనా సోకింది. జులై మాసంలో వైరస్ బారిన పడిన ఆయన కోలుకున్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ycp mla ambati rambabu